గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (15:08 IST)

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. 11వ రోజు కూడా..?

పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 11వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. నేడు డీజిల్ ధర 33 నుండి 35 పైసలకు, పెట్రోల్ ధర కూడా 30 నుండి 31 పైసలకు పెంచింది. 
 
ధరల పెరుగుదల తరువాత దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర తొలిసారిగా రూ.90 దాటింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో పెట్రోల్ ధరలు రోజు రోజుకీ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ రెండు నగరాల్లో పెట్రోల్ ధర అత్యధిక స్థాయిలో వుంది. అలాగే హైదరాబాద్‌ డిజీల్ ధర 87.91, పెట్రోల్ ధర 93.78గా వుంది. 
 
పెట్రోల్, డీజిల్ ధర ఉదయం ఆరు గంటలకు సావరిస్తారు. కొత్త ధర ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ మరియు ఇతర వస్తువులను జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.