గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (09:22 IST)

ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు.. ఆల్‌టైమ్ రికార్డ్

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులకు దూరంగా వెళ్ళిపోయాయి. సాధారణంగా మగువలకు అత్యంత ఇష్టమైన వస్తువు బంగారం. పండగ వస్తే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ మాసంలో బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
 
అయితే, ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారింది. బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.58,300కి చేరింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర అని చెప్పాలి. గత వారం రోజుల్లో బంగారం ధర మూడుసార్లు పెరిగింది. రోజుకు రూ.800కి పైగా ధర పెరుగుతున్నది. 
 
రాబోయే రోజుల్లో ఈ ధర రూ.65వేలకు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 78,300కి చేరడం విశేషం. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటుగా, డాలర్‌తో రూపాయి విలువ క్షిణించడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణం అని అంటున్నారు నిపుణులు.