సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (16:06 IST)

హ్యాపీ బర్త్ డే రివ్యూ రిపోర్ట్.. రేటింగ్ ఎంతో తెలుసా?

Happy Birthday
Happy Birthday
సినిమా: హ్యాపీ బర్త్ డే
నటీనటులు: లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్, నరేగ్ అగస్త్య, గుండు సుదర్శన్, గెటప్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ - సురేష్ సారంగం,
నిర్మాణం - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌,
నిర్మాతలు - చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు,
రచన, దర్శకత్వం - రితేష్ రానా.
సంగీతం - కాలభైరవ
 
హీరోయిన్ లావణ్య త్రిపాఠి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే..
కేంద్ర మంత్రి రితిక్ సోది (వెన్నెల కిషోర్) పలు విమర్శల మధ్య ఆయుధ వినియోగ సవరణ చట్టాన్ని తీసుకొస్తాడు. ప్రతిఫలంగా వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అందుకుంటాడు. ఆ డబ్బును ఓ స్టార్ హోటల్‌లోని లాకర్‌లో పెడతాడు. 
 
ఆ లాకర్ పాస్ వర్డ్‌ను ఒక పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసి.. చేతులు మార్చాలి అనుకుంటారు. ఇది తెలిసి ( రాహుల్ రామకృష్ణ), హోటల్ వెయిటర్ లక్కీ (నరేష్ అగస్త్య)తో ఆ పెన్ డ్రైవ్ ను దొంగతనం చేయించాలని ప్రయత్నిస్తుంటాడు. 
Happy Birthday
Happy Birthday
 
ఆ క్రమంలో ఆ పెన్ డ్రైవ్ 'హ్యాపీ (లావణ్య త్రిపాఠి)' హ్యాండ్ బ్యాగ్‌లోకి చేరుతుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? చివరకు 'హ్యాపీ' హ్యాండ్ బ్యాగ్ లోని పెన్ డ్రైవ్ ఎవరికి దొరికింది ?, ఫైనల్ గా ఆ డబ్బు ఎవరు దక్కింది ? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ :
ఒక కొత్త ఊహా ప్రపంచంలో ఈ కథ, ఈ పాత్రలు సాగుతాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల డబ్బు చుట్టూ కథ సాగడం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది. పాత్రలు మాట్లాడే డైలాగ్స్, అలాగే నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. దర్శకుడు చాలా కీలక సీన్స్‌లో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే, ఎంత ఫిక్షనల్ వరల్డ్ అయినప్పటికీ.. కథలో లాజిక్స్ మిస్ కాకూడదు. కాకపోతే, స్లోగా నడిచే స్క్రీన్ ప్లే కారణంగా సినిమాకి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
 
ప్లస్ పాయింట్స్:
లావణ్య త్రిపాఠి నటన
వెన్నెల కిషోర్
నేపథ్య సంగీతం,
సరికొత్త నేపథ్యం
 
మైనస్ పాయింట్స్:
బోరింగ్ ప్లే,
లాజిక్స్ మిస్ అవ్వడం,
స్లో సాగే ట్రీట్మెంట్,
పూర్తి ఊహాజనిత కథ
 
డిఫరెంట్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. 
 
రేటింగ్: 2.5/5