శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (15:11 IST)

ఎన్టీఆర్ "బొబ్బిలిపులి''కి 40 యేళ్లు

bobbilipuli
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన చిత్రం బొబ్బిలిపులి. దర్శకుడు దాసరి నారాయణ రావు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలై 40 యేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రానికి జూలై 9వ తేదీకి నాలుగు దశాబ్దాలు పూర్తిచేసుకోనుంది. 
 
అవినీతి, లంచగొండితనంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆ రోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఎన్నో థియేటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకొంది. 'కోర్టు కోర్టుకి.. తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానాల్లో న్యాయం ఉన్నట్టా..?', 
 
'మహాత్మగాంధీ ఒక్కడే నడుం కడితే యావత్‌ దేశమే ఆయన వెనుక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే విల్లు పడితే.. మన్యం మన్యమే ఆయన వెంట కదిలి వచ్చింది. భగత్‌సింగ్‌ ఒక్కడే.. యావత్‌ యువశక్తి ఆయన వెంట వచ్చింది' అంటూ ఎన్టీఆర్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది. 
 
అలాగే, 'సంభవం నీకే సంభవం', 'జననీ జన్మభూమిశ్చ' వంటి పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించాయి. ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమా విడుదలై జులై 9తో 40 ఏళ్లు అవుతోంది.