బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (13:31 IST)

లక్కీ భాస్కర్ విన్నరా? కాదా? - లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ

Dulquer Salmaan-Meenakshi
Dulquer Salmaan-Meenakshi
నటీనటులు: దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి-రాంకీ-రాజ్ కుమార్ కసిరెడ్డి-మానస చౌదరి-సచిన్ ఖేద్కర్-టిను ఆనంద్-సాయికుమార్-సర్వదామన్ బెనర్జీ- శివన్నారాయణ-జబర్దస్త్ మహేష్ తదితరులు
 
సాంకేతికత: ఛాయాగ్రహణం: నిమిష్ రవి,  సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి 
 
ఈ దీపావళి దాదాపు 6 సినిమాలు విడుదలకాగా, అందులో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ ఒకటి. హీరోగా తెలుగువారికి బాగా పాపులర్ అయిన దుల్కర్ ఈసారి సితార ఎంటర్ టైన్ మెంట్ లో చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ముంబైలొో సెట్ వేసి చిత్రీకరించారు. బ్యాంక్ సెట్ కు సంబంధించిన చిన్న ప్యాచ్ వర్క్ కూడా హైదరాబాద్ శివార్లో వేశారు. ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా నేడు విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
1980 కాలంలో ముంబైలోని మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్ గా భాస్కర్ (దుల్కర్ సల్మాన్) డ్యూటీ చేస్తుంటాడు. 6వేల జీతంతో భార్య, కొడుకుతోపాటు వ్యాపారంలో దెబ్బతిన్న తండ్రిని కూడా పోషించాల్సి వుంటుంది. జీతానికి మించి అప్పులు చేస్తూ వడ్డీకట్టలేక అందరితో తిరస్కభావానికి గువుతాడు. ఇక నిజాయితీగా పనిచేసే భాస్కర్ కు సీనియారిటీ రీత్యా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వస్తుందని ఆశపడి భంగపడతాడు. దాంతో విసిగిపోయిన భాస్కర్ కు అనుకోకుండా చట్టవిరుద్ధంగా సంపాదించే వ్యాపారంలో ప్రవేశిస్తాడు. అలా షేర్ మార్కెట్ ఏజెంట్ తో చేతులు కలపడంతో కోట్లకు అధిపతి అవుతాడు. తక్కువ కాలంలో కోటీశ్వరుడైన భాస్కర్ పై  సీబీఐ అధికారుల కన్నుపడి భాస్కర్ సంపాదనపై ఆరాతీస్తారు. కానీ ఎక్కడా చట్టానికి దొరక్కుండా చేసిన తెలివితేటలకు సిబిఐ వారుకూడా షాక్ అవుతారు. ఇదంతా ఎలా సంపాదించాడు? అనేది సిబిఐ అధికారి సాయికుమార్ అడగడంతోనే కథ మొదలవుతుంది. చివరికి భాస్కర్ తెలివితేటలు లక్ అనేవి ఆయన జీవితంలో ఎలా వచ్చాయి? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ కథ 1980 దశకంలో స్టాక్ మార్కెట్ వ్యవస్థను కుదేలుచేసి కోట్లకు పడగలెత్తిన హర్షద్ మెహతా కథను తీసుకున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పేశారు. అందుకే సామాన్యుడు అయి బ్యాంక్ క్లర్క్ హర్షద్ మెహతా వంటివారు ఆయన వ్రుత్తిలో ప్రవేశిస్తే ఎలాంటి మంచి చెడులుంటాయనేది దర్శకుడు చెప్పదలచిన అంశం. సామాన్యుడు కొంచెం తెలివిగా ఆలోచిస్తే జీవితంలో ఎలా ఎదగవచ్చనేది చూపాడు. అయితే ఎంత అక్రమాలు చేసిన ఎక్కడోచోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అలా పెడితే ఏమవుతుంది? పెట్టకపోతే ఏమవుతుంది? అనే రెండు పాయింట్ల మధ్య కథంతా సాగుతుంది.
 
బ్యాంకింగ్ వ్యవస్థలో బి.ఆర్. (బ్యాంక్ రిసీప్ట్) అనే ది ఎంత కీరోల్ ప్లే చేస్తుందో అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించాడు. కథానాయకుడు సామాన్యుడి అయినా లక్ వుంటే ఎలా కష్టనష్టాలను ఎదుర్కొంటాడనేది సినిమాటిక్ గా కథను రాసుకుని ప్రేక్షకుడికి రిలీఫ్ కలిగించాడు. సినిమాటిక్ గా ఎక్కువ తక్కువ  అంశాలన్నీ చక్కగా వివరించాడు. బంధువుల్లో డబ్బలునివారైతే ఎలాంటి చులకనభావంతో చూస్తారనేది కూడా రెండు సన్నివేశాల్లో చూపించాడు. 
 
గతంలోనే హర్షద్ మెహతా పై బాలీవుడ్ లో సినిమా వచ్చింది. 1992 స్కామ్ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది. బహుశా ఇప్పటి జనరేషన్ కు తెలియజేయాలనే ఈ సినిమా తీసినట్లుంది. అయితే బ్యాంకుల్ని కొల్లగొట్టి.. స్టాక్ మార్కెట్లో మాయాజాలం చేసే వాడు హర్షద్ మెహతా అయితే, అలాంటి ట్రాన్స్ స్ట్రాక్షన్ తమ చేతికి అంటకుండా బ్యాంక్ చైర్మన్ లాంటివారు సామాన్య ఉద్యోగిని ఎలా మోసం చేస్తారనేది వివరించా చూపించాడు. కథానాయకుడు కనుక వారికి తెలీయకుండా తను ఎలా జాగ్రత్తపడ్డానేది సినిమాలో కీలకమైన అంశం.
 
వెంకీ అట్లూరి ఇలాంటి సాహసోపేత కథనే ఎంచుకుని.. దాన్ని ఇంకా జనరంజకంగా చూపించాడు 'లక్కీ భాస్కర్'లో. ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును చూపించడమే కాకుండా బలమైన ఫ్యామిలీ ఎమోషన్లను కూడా పండించి 'లక్కీ భాస్కర్'ను అన్ని వర్గాలూ చూడదగ్గ సినిమాగా మలిచాడు. సామాన్యుడికి ఇగో హర్ట్ అయితే ఏ స్థాయికైనా వెళతాడనేది ఇందులో చూపించాడు. ఎంత సంపాదించినా ఎక్కడోచోట బ్రేక్ వేయాల్సిందే. అలా వేయడానికి ఓ బ్యాంక్ అధికారిని బలితీసుకోవడంతో భాస్కర్ మారినవిధానం సన్నివేశపరంగా ఆలోచింపజేసేదిగా వుంటుంది. స్టాక్ మార్కెట్ బ్రోకర్ల ఎత్తుగడలో తాము లాభపడాలంటే ఎదుటివాడు చచ్చినాపర్లేదు అనే ఫిలాసి తో వుండేవారికి భాస్కర్ ఏవిధంగా జర్క్ ఇచ్చాడనేది తెరపై చూడాల్సిందే. ఏది ఏమైనా లక్ వుంటేనే బయటపడగలడు. అందుకే టైటిల్ అలా పెట్టి హీరోకు పాజిటివ్ గా మార్చేశాడు దర్శకుడు. 
 
సీరియర్ కథ కనుక పాటలు రెండుంటాయి. అవి కథనంలో భాగమే సినిమా అంటే ఇలా వుండాలనే రూల్స్ ను మార్చేసే కథలు చాలా వచ్చాయి. అందులో ఈ సినిమా ఒకటి.  కథను అనుసరించే తగిన విధంగా రాసుకున్నాడు. కుటుంబ  ఎమోషన్లూ పండాయి. ఆర్థికంగా ఎదుగుతున్న దశలో వ్యక్తిగా పతనం అయిపోతున్న దశలో  తప్పు తెలుసుకుని దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడనే కథకు గొప్ప ముగింపు బాగుంది.
 
బ్యాంకు లొసుగులు.. అక్కడ జరిగే మోసాల నేపథ్యంలో కథను నడిపించడం పెద్ద కథకాకపోయినా హీరో ఇన్ వాల్వ్ మెంట్ తో ఎలా అధిగమనించాడనేది ఆశక్తిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది.  సినిమా టోగ్రఫీ, సంగీతం పర్వాలేదు. తెలుగులో ఇలాంటి కథను చెప్పవచ్చని నిరూపించాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటులు బాగానే నటించాడు.  జి.వి.ప్రకాష్ కుమార్  బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. తన బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో.. కథలో ఉత్కంఠను పెంచడంలో కీలక పాత్ర పోషించింది.  సింపుల్ కథే అయినా బలమైన పాత్రలు డిజైన్ చేసుకుని స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునేలా చేయడంలో లక్కీ భాస్కర్ విజయం సాధించాడనే చెప్పాలి.
రేటింగ్ : 3/5