సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీ.వీ.
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (22:24 IST)

రవితేజకు టైగర్‌ నాగేశ్వరరావు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది?! రివ్యూ

Tiger nageswrao
Tiger nageswrao
మాస్‌ మహారాజాగా పేరుపొందిన రవితేజ నుంచి దసరాకు వచ్చిన సినిమా టైగర్‌ నాగేశ్వరరావు. కొద్దిగా అనుభవం వున్న వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్‌ పిక్చర్స్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. స్టువర్ట్‌ పురం అనే దొంగ గురించి బయోపిక్‌గా తీసిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.

కథ:
చీరాల పరిసర ప్రాంతాల్లోనిది స్టువర్ట్‌‌పురం.  అది దొంగలకు ప్రసిద్ధి. ప్రయాణిస్తున్న రైలులో చొరబడి ఆభరణాలు, డబ్బు దొంగిలించడం వారి నైజం. వారు పోలీసులకు ముందుగానే ఫోన్‌ చేసి చెప్పి దొంగతనాలు చేసి సవాల్‌ విసరడం అలవాటు. ఊరికి దూరంగా నిరక్షరాస్యులుగా వున్న వారిలో పేరుపొందిన దొంగ నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తి టైగర్‌ అనే బిరుదును ఎలా పొందాడు? ప్రధానమంత్రి ఆఫీసులోనే ఆమెకు తెలీయకుండా చొరబడి ఎటువంటి సవాల్‌ విసిరాడు? 1970, 80 దశకంలో అసలు ఏమి జరిగింది? అనేది దర్శకుడు ఏవిధంగా చూపించాడనేది సినిమా.

సమీక్ష:
సమాజంలో ఓ గజదొంగను బయోపిక్‌గా తీయడం మామూలు విషయంకాదు. ఇందుకోసం ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో దర్శకుడు అతని టీమ్‌ పర్యటించి కథ రాసుకున్నామని పలుసార్లు చెప్పారు. ఆయన స్వతహాగా దొంగకాదు. పరిస్థితుల వల్ల అలా మారాడు అన్నది చెప్పామని దర్శకుడు తెలిపారు. సినిమా చూశాక అలానే వుంది.

అప్పటికీ, ఇప్పటికీ పోలీసు, రాజకీయ వ్యవస్థ ఏమీ మారలేదు. ఎక్కడైనా భారీగా దొంగతనాలు జరిగితే స్టూవర్ట్‌‌పురంలోని పిల్లలను, వృధ్ధులను, మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారణ పేరుతో అరాచకాలు చేయడం, అందుకు ఫలితంగా అప్పట్లో రేటును బట్టి 60 రూపాయల నుంచి 200 రూపాయలు ఇవ్వడం చూపించాడు.

అయితే నాగేశ్వరరావు చేసే దొంగతనాల్లో సాహసం ఎక్కువగా వుండేది. కె.జి.ఎఫ్‌. సినిమా తర్వాత హింసాత్మక సన్నివేశాలతో కథలు వస్తున్నాయి. ఆ కోణం లోనిదే మరొకటి అని చెప్పవచ్చు. ప్రదానమంత్రి పేషీ అదికారులు మురళీశర్మను ఢిల్లీకి పిలించి నాగేశ్వరరావు కథ చెప్పమనడంతో కథ మొదలువుతుంది. మధ్యలో నాగేశ్వరరావు చేసిన తెగింపు కానీ, తోటివారిని బాగుచేయాలనే తాపత్రం, మహిళలపై ఆయనకున్న అభిప్రాయాలు, ప్రేమ అనే మరో కోణం ఇత్యాది విషయాలను చర్చించడంతో కథ చాలా పెద్దగా అనిపిస్తుంది.  రెండుగంటల  52 నిముసాలు నిడివి వుండడంతో ఎక్కువసేపు సినిమా చూశామనీ ఫీలింగ్‌ కలుగుతుంది.

మొదటి భాగంలో డబ్బు దాహం, కామదాహం కోసం ఎటువంటి తెగింపుకు పాల్పడతాడనేది దర్శకుడు హైలైట్‌ చేశాడు. సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆయన స్టువర్ట్‌పురం ఊరి జనాలకు దేవుడులాంటివాడు అని చెప్పాడు. ఈ క్రమంలో ఊరి పెద్దలు, ఎం.ఎల్‌.ఎ.లు నాగేశ్వరరావు జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించారనే వెల్లడించాడు.

మొత్తంగా చూస్తే ఫస్టాఫ్‌ అనవసరం అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనే కథ చెప్పడం, అదే కాస్తోకూస్తో బాగోవడంతో ఇది చాలు అనిపిస్తుంది. స్టువర్ట్‌పురం వాసులు దొంగలు కాదు. మంచివారే వారిని సమాజాం, పరిస్థితులు, పోలీసు, రాజకీయాలు మార్చేశాయని దర్శకుడు చెప్పాడు. దాంతో గతంలో దేశంకోసం పోరాడిన యోధుల గురించి తెలుసుకుంటున్నట్లుంటుంది. మరి రవితేజ ఇమేజ్‌ను బేరీజు వేసుకుని అలా దర్శకుడు చెప్పాడోమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికీ వాస్తవం పెద్దగా తెలీదు. నాగేశ్వరరావు కుటుంబీలు పెద్దగా లేరు. అప్పట్లో వున్న రిటైర్‌ పోలీస్‌ నుంచి కొద్దిగా సమాచారంతో పాటు పేపర్ల ప్రచురించిన కథనాలు బేస్‌చేసుకుని తీశారు.

అయితే నిన్న విడుదలైన రెండు సినిమాల్లోనూ వున్న హింసాత్మక సన్నివేశాలు నాగేశ్వరరావు సినిమాలోనూ వున్నాయి. పెద్దగా పాటలకు అవకాశంలేని ఈ బయోపిక్‌లో కత్తితో తలలు నరకడం వంటివి చాలా వున్నాయి.

సంగీతపరంగా జీవి ప్రకాష్‌ బాణీలు పర్వాలేదు అనిపిస్తాయి. కెమెరా మధి పనితం ఇందులో కనిపించింది. ఎడిటింగ్‌కు ఇంకా పనిచెప్పాల్సింది. శ్రీకాంత్‌ విస్సా మాటలు అక్కడక్కడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగానే వున్నాయి. ఎటొచ్చీ.. రవితేజ, కథనం ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్లుగా చెప్పవచ్చు. నిడివి ఎక్కువగా వుండడం, మితిమీరిన బిల్డప్‌ సన్నివేశాలు మైనస్‌లుగా చెప్పవచ్చు.

ఇలాంటి కథలు సభ్యసమాజానికి ఏ సందేశం ఇస్తాయని అంటే, టైగర్‌ నాగేశ్వరరావు స్టువర్ట్‌ పురం వాసుల్ని మంచివారిగా మార్చడానికి  తను ఎలా బయ్యాడనేది కథ. దానికోసం ఓపిగ్గా కూర్చొని ప్రేక్షకుడు చూడాలి.

రేటింగ్‌: 2.5/5