మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (16:36 IST)

ఉమ్మడి కుటుంబం అంటే చిరాకు.. నా కాబోయే వాడు షూ లేస్‌తో సమానం (Video)

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం "మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్". బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. జీఏ2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాసు నిర్మిస్తున్నారు. అయితే, విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది.
 
ఈ చిత్రంలోని డైలాగులు చాలా వెరైటీగా ఉన్నాయి. కాబోయే వాడు ఎలా ఉండాలని అఖిల్ అడిగితే ఆమె అన్నీ రివర్స్‌లో సమాధానాలు చెప్పి అఖిల్‌కు షాక్ మీద షాక్ ఇచ్చింది. ముఖ్యంగా, తనకు కాబోయే భర్త షూలేస్‌తో సమానమని హీరో ముఖం చెంపఛెళ్లుమనేలా చెబుతుంది.
 
పైగా, అన్ని పనులు భర్తే చేయాలని, జాయింట్ ఫ్యామిలీ అంటే తనకు చిరాకని చెబుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.