గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (12:25 IST)

రాధేశ్యామ్ సినిమా స్టోరీ లీక్.. క్లైమాక్స్ అలా వుంటుందా?

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా స్టోరీ ప్రస్తుతం లీక్ అయ్యింది. సాధారణంగా రాధేశ్యామ్ అంటే రాధా కృష్ణులు అని అర్థం. ప్రేమకు ప్రతిరూపంగా ఈ ఇద్దరిని చెప్పుకుంటారు. కానీ చివరకు వీరి కథ మాత్రం సుఖాంతం కాదు.

గుండెల నిండా ప్రేమ ఉన్నా కూడా ఈ ఇద్దరూ జీవితంలో కలవలేదు. దూరంగానే ఉండిపోయారు. అలా వారి పేర్లను ఇక్కడ ప్రస్తావించి టైటిల్‌గా పెట్టడం, తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లోనూ అలాంటి కొన్ని ప్రేమ జంటల ఆనవాళ్లు ఇవ్వడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
 
మోషన్ పోస్టర్‌లో ఉన్న ట్రైన్‌ అందులో ఒక్కో కంపార్ట్మెంట్‌లో ఒక్కో ప్రేమగాథను చూపించాడు. దేవదాస్ పార్వతి, సలీం అనార్కలీ, రోమియో జూలియెట్ ఇలా చరిత్రలో గొప్ప ప్రేమికులందరినీ చూపించాడు. వీరి తరువాత ఉన్న కంపార్ట్మెంట్‌లో ప్రేరణ (పూజా హెగ్డే), విక్రమ్ ఆదిత్య (ప్రభాస్)లను చూపించాడు.
 
మోషన్ పోస్టర్‌లో చూపించిన ప్రతీ ఒక్కటి విషాద గాథే. పారు దేవదాస్ చివరకు కలుసుకోనేలేదు. రోమియో జూలియట్, సలీం అనార్కలీ కథలు అందరికీ తెలిసిందే. ఇలా అందర్నీ ఒకే చోట చూపించి తరువాత ప్రభాస్ పూజాహెగ్డేల అందమైన జంటను చూపించడంతో ఇది కూడా విషాద గాథే అని అర్థమవుతోంది. అయితే ఇలాంటి విషాద గాథకు ఇటలీ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం కాస్త ఫ్రెష్‌గా అనిపించొచ్చు. 
 
కానీ విషాధ ప్రేమ కథను ప్రభాస్ ఫ్యాన్స్ అంగీకరిస్తారో లేదో అనేది అనుమానమే. ఒకవేళ విషాదగాథను ప్రేక్షకులు అంగీకరించకపోతే.. చివర్లో క్లైమాక్స్ మార్చే ఛాన్సులు వున్నాయంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.