శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr

సారీ అమ్మా, చేసింది తప్పే ఫిదా భామ ఏంచేసింది? 'కణం' ట్రైలర్

యంగ్ హీరో నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. "కణం" పేరిట నిర్మిస్తున్న ఈ సినిమాను తమిళంలో ‘కరు’గా తెరకెక్కిస్తున్నారు.

'ఫిదా' సినిమాలో భానుమతిగా న‌టించిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్షకుల్ని నిజంగానే ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసల కురిసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ఆ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తర్వాత నానితో కలిసి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా ట్రైలర్‌తోనూ సాయి పల్లవి ఆకట్టుకొంది. ఈ మూవీ డిసెంబ‌ర్ 21న విడుద‌లకు ముస్తాబవుతోంది. 
 
ఇదికాకుండా, యంగ్ హీరో నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. "కణం" పేరిట నిర్మిస్తున్న ఈ  సినిమాను తమిళంలో ‘కరు’గా తెరకెక్కిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. 
 
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. సారీ అమ్మా, చేసింది తప్పే.. అలా ఏమీ వద్దమ్మా అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగ్‌లతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ మాటలతోపాటు కణం టైటిల్, ట్రైలర్‌ను బట్టి అబార్షన్ క్రమంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.