గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (18:20 IST)

అఖిల్ ఏజెంట్‌కు డెత్‌ నోట్ రాసిన మ‌మ్ముట్టి- ఏజెంట్ టీజ‌ర్ అదుర్స్‌ (video)

Akhil Akkineni
Akhil Akkineni
అఖిల్ అక్కినేని న‌టించిన `ఏజెంట్‌` టీజ‌ర్ శుక్ర‌వారంనాడు హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని భ్ర‌మ‌రాంబిక థియేట‌ర్లో అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల‌యింది. మమ్ముట్టి జాతీయ భద్రతా సంస్థ అధిపతి మహదేవ్ దృష్టికోణంలో టీజర్ కట్ చేశారు.. విచారణ కోసం పిలిచినప్పుడు, అతను ఏజెంట్ యొక్క ధైర్యం, పరాక్రమం మరియు అనూహ్య స్వభావాన్ని వెల్లడించాడు. క్రూరమైన దేశభక్తుడు అతన్ని పట్టుకోవడం అసాధ్యం అని అతను చెబుతాడు. తన డెత్‌ నోట్‌ ఇప్పటికే రాసి ఉందని చెప్పాడు. 
 
అనంత‌రం తన ప్రియురాలు అతన్ని, వైల్డ్ సాలే అని పిలుస్తుంది. ఈ టీజర్ కట్ లో అఖిల్ డైలాగ్స్వి, జువల్స్ చాలా బాగున్నాయి. ఫైన‌ల్‌గా జీప్‌లో వెళుతూ ఏజెంట్‌, మాద‌చెత్ కిల్‌మీ.. అంటూ ఆవేశంగా ప‌లికే డైలాగ్స్ క‌థ‌లో సీరియ‌స్‌నెస్‌ను తెలియ‌జేసింది. 
 
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఏజెంట్. ఈ చిత్రం కోసం అఖిల్ తన శరీరాకృతి ను మార్చుకొని చాలా కష్టపడ్డారు.  కాగా, ఈ ఏజెంట్ టీజ‌ర్‌ను శివ కార్తికేయన్, కిచ్చా సుదీప్ కలిసి తమిళం, కన్నడ భాషలలో విడుద‌ల‌చేశారు. అఖిల్,మమ్ముట్టి తెలుగు,మలయాళంలో టీజర్ విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.