సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (10:24 IST)

లక్ష్మీభాయి అనే నేను... నా చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకు... (మణికర్ణిక ట్రైలర్)

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన చిత్రం "మణికర్ణిక". ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథా, కథనాలను విజయేంద్ర ప్రసాద్ అందించడం గమనార్హం. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల హిందీలో విడుదల చేయగా, తాజాగా తెలుగులోనూ రిలీజ్ చేశారు. 'సాహసవంతురాలైన యువతిగా.. మహారాణిగా.. మాతృమూర్తిగా.. మహా యోధురాలిగా ఈ ట్రైలరులో కంగనా రనౌత్‌ను చూపించారు. 'ప్రతి భారతీయుడిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను'. 
 
'ఝాన్సీ మీకూ కావాలి.. నాకూ కావాలి. మీకు రాజ్యాధికారం కోసం కావాలి.. నాకు మా ప్రజలకి సేవ చేసుకోవడానికి కావాలి' 'లక్ష్మీభాయి అనే నేను నా చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకు ఈ దేశం కోసం పోరాడుతాను' అనే డైలాగ్స్ బాగున్నాయి. ఈ తెలుగు ట్రైలర్‌ను ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా చూడటం గమనార్హం.