సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 జులై 2024 (09:32 IST)

ఆకట్టుకున్న పేక మేడలు మూవీ ట్రైలర్ - సినిమా విడుదలకు సిద్ధం

pekamedalu crew
pekamedalu crew
పేక మేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్. గతంలో 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. రీసెంట్ గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తూ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నారు. ఈ నెల 19న పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : మీడియా ప్రముఖుల ద్వారా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ సినిమాను చూపిస్తున్నాం. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ని కూడా  ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. మీడియా మరియు ప్రేక్షకుల సపోర్ట్ మా సినిమా పై ఉండాలని సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ : నా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సపోర్ట్ ఇస్తున్న మీడియా వారికి కృతజ్ఞతలు. వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసాం అది పెద్ద సక్సెస్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ వరకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాం. ఇది ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆడవారు మగవారికి ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్ తో మంచి కాన్సెప్ట్ సినిమాని తీసాం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఈ 19 సినిమా విడుదల చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరోయిన్ అనుష కృష్ణ మాట్లాడుతూ : మల్లి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు. మీ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ : తెలుగులో హీరోగా ఇది నా మొదటి సినిమా. నన్ను సెలెక్ట్ చేసుకున్న నా డైరెక్టర్ నీలగిరి గారికి ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారికి కృతజ్ఞతలు. ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. ఇదేవిధంగా సినిమా కూడా చూసి సపోర్ట్ చేయాలని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.