సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (10:32 IST)

పరిశ్రమలో కష్టపడనిదే విజయం దక్కదు: తనికెళ్ళ భరణి

Tanikella Bharani - Gopichand Malineni and others
Tanikella Bharani - Gopichand Malineni and others
పరిశ్రమలో కష్టపడనిదే విజయం దక్కదు. దర్శకుడు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మార్చి 21న దాని ఫలితం దక్కుతుంది. రాజశేఖర్ రాసిన మాటలు చాలా బావున్నాయి. ఇందులో పాటలు కూడా చాలా చక్కగా వున్నాయి. కొత్త హీరోలు ఇద్దరు ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వచ్చారు. వారని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. హద్దులేదురా సినిమాకి హద్దు ఉండకూడదని కోరుకుంటున్నాను అని తనికెళ్ళ భరణి అన్నారు.
 
ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ”హద్దు లేదురా'. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్  బ్యానర్స్ పై  వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. రావి మోహన్ రావు సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం  టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్యఅతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
 
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ..  ఈ సినిమా కథ అద్భుతంగా వుంది. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి.  కృష్ణార్జునులు స్నేహం ఇతివృత్తంగా తీసుకోవడం చాలా బావుంది. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.'' అన్నారు.
 
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..”హద్దు లేదురా'.. దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు. సినిమా అద్భుతంగా తీశాడు. చాలా మంచి సినిమా అవుతుంది.  మొదటి సినిమా బర్త్ లాంటింది. నా మొదటి సినిమా డాన్ శ్రీను ఇప్పటికీ మర్చిపోలేను. మొదటి సినిమా మనం ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా. రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్ లోనే వున్నాడు. మొదటి సినిమా కోసం ఫ్రెండ్షిప్ అనే మంచి పాయింట్ తీసుకున్నాడు.  ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్  కూడా వుంది.  ఆశిష్‌ గాంధీ నేను చేసిన 'విన్నర్' లో చేశాడు. తర్వాత నుంచి మంచి నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. వీరేష్ చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని నిరూపించుకున్నాడు. నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద  అభిమానినో రాజశేఖర్ కూడా అంతే పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 21న సినిమా విడుదలౌతుంది.  సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
 
ఇంకా ఆశిష్‌ గాంధీ, దర్శకుడు రాజశేఖర్, నిర్మాత వీరేష్ ఎస్తర్ మాట్లాడుతూ..మార్చి 21న అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నామని అన్నారు