నిత్యపెళ్లి కొడుకు.. అతడి వయస్సేమో 28.. ఏకంగా 24మందిని పెళ్లాడాడు..

Written By సెల్వి
Updated: శనివారం, 1 అక్టోబరు 2022 (19:42 IST)
అతడు నిత్యపెళ్లి కొడుకు.. అతడి వయస్సేమో 28.. ఏకంగా 24మందిని పెళ్లి చేసుకున్నాడు. రోజుకో పేరుతో నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించడం, పెళ్లిళ్లు చేస్కోవడం, పత్తా లేకుండా పారిపోవడం.. ఇలా సాగిస్తూ వచ్చాడు. చివరకు ఆఖరుగా చేసుకున్న అమ్మాయికి దొరకిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను అసబుల్ మొల్లా అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఒతడు ఒక్కసారిగా మాయమైపోయాడు. అలాగే ఇంట్లోనే ఉన్న ఆమె నగలు కూడా కనిపించకుండా పోయాయి. 
 
దీంతో అనుమానం వచ్చిన ఆమె.. భర్త మోసం చేశాడని సాగర్ దిగీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పోలీసులకు షాకిచ్చే నిజాలు తెలియవచ్చాయి. 
 
వృత్తిని మార్చుకుని, పేరును మార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులతో బీహీర్, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో అసబుల్ తిరిగేవాడని తేలింది. అంతేగాకుండా ఒక చోట అనాథ అని, మరో చోట జేసీబీ డ్రైవర్ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
 
పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యే వాడు. ఇలా 23 మందిని మోసం చేసి సాగర్ దిగీలోని ఓ మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన చేతి వాటం చూపించి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఈసారి పోలీసులకు చిక్కాడు.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments