బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:07 IST)

దక్షిణాదిలో బీజేపీకి సున్నా.. కానీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే...

దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేస

దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఏబీపీ-సీ ఓటర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేలింది.
 
గడచిన మూడునెలల్లో జరిపిన 'దేశ్‌ కా మూడ్' పేరుతో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమికి 276, యూపీఏకు 112, ఇతరులకు 155 స్థానాలు లభించవచ్చని తెలిపింది. 
 
ఓట్ల శాతం ప్రకారం చూస్తే ఎన్‌డీఏకు 38 శాతం, యూపీఏకు 25 శాతం, ఇతరులకు 37 శాతం ఓట్లు పడవచ్చునని అంచనా వేయగా, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏమాత్రం పుంజుకోలేదని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికి 21, యూపీఏకు 32, ఇతరులకు (ప్రాంతీయ పార్టీలకు) 76 స్థానాలు లభిస్తాయని సర్వే పేర్కొంది.