శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (17:39 IST)

అలా చేసేవారిపైనే ప్రేమ పుడుతుంది : అనుపమా పరమేశ్వరన్

తన హావభావాలతోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అనుపమ పరమేశ్వరన్. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోను నటించి ప్రేక్షకులను మెప్పించింది.

తన హావభావాలతోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అనుపమ పరమేశ్వరన్. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోను నటించి ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్లలో చాలామంది ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా డేటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎవరెన్ని అనుకున్నా మా లైఫ్ మాదేనంటూ కొంతమంది హీరోయిన్లు వ్యవహరిస్తున్నారు.
 
కానీ అనుపర పరమేశ్వరన్ మాత్రం అందరిలా కాకుండా తన రూటే సపరేటు అంటోంది. కష్టపడే తత్వం, ఎదుటి మనిషికి విలువ ఇచ్చే గుణం, అందరినీ కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడగలిగే స్వభావం, మహిళలంటే గౌరవం... ఇలా అన్ని విధాలుగా ఉండే వ్యక్తినే ఇష్టపడాలనుకుంటున్నాను... ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అంటోంది అనుపమ. 
 
ఇప్పటివరకు ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కనబడలేదని, కనిపిస్తే ఖచ్చితంగా ప్రేమ పెళ్ళి చేసుకుంటానని చెబుతోంది అనుపమ. మరి చూడాలి అనుపమ అనుకున్న విధంగా అణకువ ఉన్న అబ్బాయి ఎక్కడ దొరకుతాడో?