శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:10 IST)

బ్యాంకులో పోకిరి మేనేజర్ వెకిలి చేష్టలు.. రోడ్డుపై పరుగెత్తించిమరీ బడిత పూజ

మీటూ ఉద్యమం పుణ్యమాని మహిళా లోకం నిద్రలేచినట్టుగా ఉంది. తమను ఏమాత్రం హేళన చేసేలా మాట్లాడినా... తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వీరనారిలా రెచ్చిపోతున్నారు. తాజాగా పోకిరి మేనేజర్‌కు ఓ మహిళ నడి రోడ్డుపై పరుగెత్తించి మరీ బడితె పూజ చేసింది. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
బెంగళూరు నగరానికి చెందిన ఓ మహిళ తన వ్యక్తిగత పనిమీద బ్యాంకుకు వెళ్లింది. అక్కడ తన పని కోసం మేనేజర్‌ను కలవాల్సి వచ్చింది. ఆ పోకిరి మేనేజర్ మాత్రం పని చేసిపెట్టాలంటే తన కోర్కె తీర్చమన్నాడు. అంతే ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వీరనారిలా రెచ్చిపోయి తన పవర్ ఏంటో చూపించింది. కర్రపట్టుకుని నడిరోడ్డుపై చితకబాదింది. 
 
ఈ దెబ్బలు తట్టుకోలేని బ్యాంకు మేనేజర్ రోడ్డుమీద పరుగులు పెట్టాడు. అందరూ చూస్తుండగానే పోకిరీ మేనేజర్‌కు ఒళ్లు వాచిపోయేలా బుద్ది చెప్పిందీ ఈ వీరవనిత. తనను వదిలేయమని మరోసారి ఇలాంటి తప్పు చేయనని, చివరకు బ్యాంకు మేనేజర్ ఆమె కాళ్లు పట్టుకున్నాడు. అయినా మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడం ఏంటి అని ఆమె మాటలతో కడిగిపారేసింది.