బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (19:51 IST)

హనుమంతుడి ఫోటో ముందు బికినీ బాడీబిల్డర్ ఫోజులు

Hanuman
శ్రీరామ భక్తుడు హనుమంతుడి ఫోటో ముందు బికినీ ధరించిన మహిళా బాడీబిల్డర్లు ఫోజులిచ్చిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని హనుమంతుడి చిత్రం ముందు మహిళా బాడీబిల్డర్లు ఫోజులిచ్చిన దృశ్యాలు నెట్టింట ప్రచారంలోకి రావడంతో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.
 
13వ మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు, మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో రెండు రోజుల పాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా బాడీబిల్డర్ హనుమాన్  ఫోటో ముందు ఫోజులివ్వడం వివాదానికి దారితీసింది.