సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 20 మార్చి 2020 (21:30 IST)

మరోసారి చరిత్రలోకి తిరుమల, 128 సంవత్సరాల తర్వాత ఇలా

తిరుమల అంటేనే ఒక చరిత్ర. మళ్ళీ చరిత్రలో నిలిచిపోవడం ఏంటని అనుకుంటున్నారా..? అది కూడా సరిగ్గా 128 సంవత్సరాల తరువాత చరిత్రలో నిలిచిపోయే సంఘటన ప్రస్తుతం జరుగుతోంది. అది కూడా తీవ్ర చర్చకు దారితీస్తూ ప్రపంచాన్నే వణికిస్తోంది.
కరోనా వైరస్‌తో తిరుమల గిరులు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. సరిగ్గా 128 సంవత్సరాల క్రితం.. అంటే 1892వ సంవత్సరంలో తిరుమల ఆలయాన్ని రెండురోజుల పాటు మూసేశారు. అది కూడా మఠాధిపతుల, పీఠాధిపతులు, జియ్యంగార్ల సలహాలు తీసుకుని.
 
ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా, తుఫాన్లు వచ్చినా తిరుమల ఆలయాన్ని మూసిన దాఖలాలు చాలా అరుదు. 1892 సంవత్సరం తరువాత 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో భక్తులు రద్దీ తగ్గారు.. అప్పుడు తిరుమల ఖాళీగా ఉంది. మళ్లీ 2018 ఆగష్టు నెలలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించారు. 
అప్పుడు కూడా తిరుమల ఖాళీగా కనిపించింది. అంతేకాదు ఐదురోజుల పాటు భక్తులను దర్సనానికి అనుమతించలేదు. కానీ భక్తుడికి స్వామివారిని, స్వామివారిని భక్తుడికి దూరం చేయడం ఇదొక చరిత్రగా నిలిచిపోతుందన్న భావన అందరిలో ఉంది.
వారంరోజుల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. కానీ భక్తులను మాత్రం అనుమతించరు. ఇలా జరుగుతుండటంపై భక్తుల్లో ఒకరకమైన భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం భక్తులను దర్సనానికి అనుమతించకుండా ఆపేయడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.