గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జులై 2022 (13:41 IST)

కొబ్బరి చిప్పల్లో చాయ్.. చెన్నై మెరీనాలో దీనా షాపు అదుర్స్

Tea
Tea
కొబ్బరి  చిప్పల్లో చాయ్ గురించి మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. చాయ్‌ను అందరిలాగా గ్లాసుల్లోనో, కప్పుల్లోనో కాకుండా కొబ్బరి చిప్పల్లో అమ్ముతున్నాడు. ఐడియానే కాదు.. చాయ్ టేస్ట్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుంది. 
 
ఇంకేముంది. బిజినెస్ కూడా క్లిక్ అవ్వడంతో మనోడు ఇప్పుడు ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆరు నెలల క్రితం చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద ఈ టీ షాప్ పెట్టిన దీనా.. మొదట్లో గ్లాసుల్లోనూ, కప్పుల్లోనూ కాఫీ, టీ అమ్ముతుండేవాడు.
 
కానీ పర్యావరణ అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కొబ్బరి చిప్పల్లో కాఫీ, టీ అందించాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేకంగా కొబ్బరి చిప్పలను తయారు చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నాడు. 
 
రోజుకు దాదాపు 60- నుంచి 70 కప్పులను ఉపయోగిస్తున్నట్లుగా దీనా తెలిపాడు. అతనిలో మరో గొప్ప క్వాలిటీ కూడా ఉంది. ప్రతి సోమవారం ఒక కప్పు బ్లాక్ కాఫీని కేవలం ఒక రూపాయికి మాత్రమే అందిస్తాడు. దీనా చాయ్ మాస్టర్ కాదు. దీనా రైటర్ కూడా.. సినిమాలంటే పిచ్చి. సినిమాలకు మాటలు రాయాలనే కోరిక అతనికి ఉందట.
 
"నేను కొబ్బరి చిప్పలపై టీని అందించాలని అనుకున్నాను. గాజు మరియు కాగితపు కప్పులతో పోలిస్తే కొబ్బరి పెంకు సేంద్రీయంగా ఉంటుంది" అని దీనా చెప్పాడు.