స్వల్ప అస్వస్థతకుగురైన తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను మూడు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులకు సూచించడంతో ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రజలతో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అదేసమయంలో జిల్లాల్లో పర్యటిస్తూ, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును ఆకస్మిక తనిఖీల ద్వారా తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి ఆయన జ్వరతో బాధపడుతున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. రెండురోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు.
కాగా, అనారోగ్యం నేపథ్యంలో సోమవారం నుంచి మూడు జిల్లాల్లో సాగాల్సిన ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలు రద్దు అయ్యాయి. ఆయన వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో పర్యటించి, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుంది.
పైగా, ఆయన పర్యటనకు డీఎంకే శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఆయన అస్వస్థత కారణంగా తన ఇంటికే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు.