శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (15:17 IST)

మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని...

మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు ఉరివేసుకున్నారు. ఈ యువకుడు పీజీ చేస్తూ ఈ విషాదానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఆ మాజీ ఎమ్మెల్యే పేరు కాటసాని రామిరెడ్డి. ఈయన పెద్ద కుమారుడ

మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు ఉరివేసుకున్నారు. ఈ యువకుడు పీజీ చేస్తూ ఈ విషాదానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఆ మాజీ ఎమ్మెల్యే పేరు కాటసాని రామిరెడ్డి. ఈయన పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి. వయసు 28 యేళ్లు.
 
హైదరాబాద్‌లో పీజీ చేస్తూ ఈనెల 12వ తేదీన తమ సొంతూరు అయిన కర్నూలు జిల్లా బనగానపల్లెకు వెళ్లాడు. అక్కడ ఎమైందో ఏమోగానీ, ఈనెల 14వ తేదీన రాత్రి తమ నివాసంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో కాటసాని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆత్మహత్య చేసుకున్న నాగార్జునరెడ్డి పెదనాన్నే.. కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం నియోజకవర్గం నుంచి వరసగా ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఆయనది. 
 
నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా బామ్మర్ది నాగార్జునరెడ్డి కావటం విశేషం. తన రాజకీయవారసుడు నా పెద్ద కుమారుడే అంటూ అందరికీ చెబుతుండేవారు కాటసాని రామిరెడ్డి. ఇలాంటి సమయంలో ఇంటి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకోవటం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.