శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (18:56 IST)

అంబానీని క్రాస్ చేసిన ఆదానీ .. ఆసియా కుబేరుడుగా...??

ప్రస్తుతం ఆసియా కుబేరుడుగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఇపుడు ఈయన్ను మరో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ క్రాస్ చేశారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. అయితే, ఇదే బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం గౌతం అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ సంపద 91 బిలియన్ డాలర్లు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే. 
 
అయితే, ఈ డేటా తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదేసమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెట్టింది. ఆరామ్‌కో ఒప్పందం తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజుకూ క్షీణిస్తూ వస్తున్నాయి. రూ.2500 పైగా ఉన్న రిలయన్స్ స్టాక్ ఇపుడు రూ.2350గా వుంది. బుధవారం మరో 5.7 శాతం క్షీణించింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ స్టాక్ 2.94 శాతం వృద్ధి కనిపించింది. 
 
ముఖ్యంగా, ఈ యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి అదానీ సంపద 55 బిలియన్ డాలర్ల మేరకు పెరగా, అదేసమయంలో ముఖేశ్ అంబానీ సంపదలో వృద్ధిరేటు 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆసియా కుబేరుడుగా గౌతమ్ అదానీ అవతరించారని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.