Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం... ఆ సీన్ లీక్.. కారణం ఎవరంటే..?

స్టార్ హీరోల సినిమాలకు లీకుల గోల తప్పట్లేదు. నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత సీన్లు లీక్ కావడంతో ఆ సినిమా యూనిట్ తలపట్టుకుంది. తాజాగా గీత గోవిందం సినిమాకు కూడా ఇక్కట్లు తప్పలేదు. అ

Written By selvi
Updated: ఆదివారం, 12 ఆగస్టు 2018 (11:22 IST)
స్టార్ హీరోల సినిమాలకు లీకుల గోల తప్పట్లేదు. నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత సీన్లు లీక్ కావడంతో ఆ సినిమా యూనిట్ తలపట్టుకుంది. తాజాగా గీత గోవిందం సినిమాకు కూడా ఇక్కట్లు తప్పలేదు.


అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ''గీత గోవిదం'' సినిమా పైరసీ వ్యవహారంలో ఇంజనీరింగ్ విద్యార్థులున్నట్లు తెలియరావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లీకైన సీన్లలో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య గల లిప్ లాక్ సీన్ కూడా వుండటంతో అమాంతం వైరల్ అవుతోంది. 
 
ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా గీత గోవిందం చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు దర్శనమివ్వడంతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.
 
స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చేపట్టిన విచారణలో గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సినిమా సీన్లను షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హైదరాబాద్‌లో సినిమా ఎడిటింగ్ సమయంలో ఓ వ్యక్తి వీటిని అక్రమంగా కాపీ చేసినట్లు తేలిందని పోలీస్ అధికారి చెప్పారు. 
 
సోషల్ మీడియాలో ఈ సీన్లు షేర్ కావడంతో వైరల్ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments