గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:09 IST)

ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పడబోయిన మహిళ.. అలా కాపాడాడు...

Train
రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలులో కదులుతున్న సమయంలో ఓ మహిళ అందులోంచి దిగింది. ఆ వెంట‌నే మ‌రో మ‌హిళ దిగ‌బోతుండ‌గా ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయింది. ఇంతలో ఓ పోలీసు ఆమెను కాపాడాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ప‌శ్చిమ బెంగాల్‌లోని పురులియా రైల్వే స్టేష‌న్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలు క‌దులుతోన్న స‌మ‌యంలో ఓ మ‌హిళ అందులోంచి దిగింది. ఆ వెంట‌నే మ‌రో మ‌హిళ దిగ‌బోతుండ‌గా ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయింది. 
 
దాదాపు ఆమె రైలు కింద ప‌డిపోనుంద‌న్న స‌మ‌యంలో అక్క‌డి ఆర్పీఎఫ్ స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ బ‌బ్లు కుమార్ ప‌రుగులు తీసి ఆమెను ప్లాట్‌ఫాం మీద‌కు లాగాడు. దీంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. 
 
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. మ‌హిళ‌ను ర‌క్షించిన ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్ట‌ర్‌పై అధికారులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆ మ‌హిళ ప్రాణాల‌ను ఆయ‌న కాపాడిన వీడియోను ఆర్పీఎఫ్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.