మాకది కావాలంటూ రోడ్డుకి అడ్డంగా గ్రామస్తులు, గర్జించిన సింహా

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (18:57 IST)
సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో బాలక్రిష్ణ దూకుడు అందరికీ తెలిసిందే. పార్టీ కార్యకర్తలు, అభిమానులపై తనదైన శైలిలో రఫ్ ఆడించే బాలక్రిష్ణ... తనకు ఎవరైనా అడ్డు చెబితే మాత్రం ఊరుకోరు. ఉగ్రరూపాన్ని చూపిస్తుంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలాంటి పనులు ఎన్నో చేశారు బాలయ్య. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా మారారు. 
 
తన తండ్రి సొంత పార్టీ కాబట్టి చంద్రబాబు బాలక్రిష్ణను ఏమీ అనలేక సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. అయితే అధికారం కోల్పోయిన తరువాత కూడా బాలక్రిష్ణ తన దూకుడును తగ్గించలేదు. చంద్రబాబు నాయుడు పిలుపుతో తన సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని హిందూపురంలో పర్యటించారు బాలక్రిష్ణ. ఇసుక కొరతపై నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు. 
 
అయితే మార్గమధ్యంలో గలిబిపల్లి గ్రామస్తులు బాలక్రిష్ణ కారును అడ్డుకున్నారు. మా ఊరుకు రోడ్డు లేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మాకు రోడ్డెయ్యండి. మీరు ఎమ్మెల్యే కదా అంటూ గట్టిగా గ్రామస్తులు నిలదీశారు. కాసేపు సైలెంట్‌గా విన్న బాలక్రిష్ణ ఆ తరువాత తన ప్రతాపాన్ని గ్రామస్తులకు చూపించాడు. సైలెంట్.. ఎప్పుడు ఏది.. ఎలా చేయాలో నాకు తెలుసు. రోడ్డే కదా.. నేను వేయిస్తా.. సైలెంట్‌గా ఉండండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో అక్కడి వారందరూ ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు.

అన్నీ చూడండి

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments