Daily Horoscope
✕

ఆ ట్రాక్టర్ డ్రైవర్ అదృష్టవంతుడు... ఎందుకంటే..? (video)

Written By సెల్వి
Updated: సోమవారం, 12 అక్టోబరు 2020 (16:36 IST)
ఆ ట్రాక్టర్ డ్రైవర్ అదృష్టవంతుడు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైనా.. డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రాక్టర్ రెండు ముక్కలు అయినప్పటికీ దాని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. చిన్న రోడ్డు నుంచి ఓ ట్రాక్టర్ హైవే పైకి వచ్చింది. ఇంతలో అదే రోడ్డుపై ఓ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి ట్రాక్టర్ ముందు భాగాన్ని ఢీ కొట్టింది. కారు వేగానికి ఆ ట్రాక్టర్ ముందు భాగం రెండు ముక్కలైంది. సరిగ్గా డ్రైవర్ సీటు దగ్గర ట్రాక్టర్ విరిగిపోయింది. 
 
అయినా కూడా డ్రైవర్‌కు మాత్రం ఏం గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని.. ప్రాణనష్టం జరగకపోవడం సంతోషమని కామెంట్లు పెడుతున్నారు.

అన్నీ చూడండి

సోషల్ మీడియాతో తంటాలు పడుతున్న హీరోయిన్లు.. అయినా చుక్కలు చూపిస్తున్నారు..

పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ది ప్రాంప్ట్ వార్-రైజ్ ఆఫ్ మహావీర్ ప్రకటన

విజయదశమి సందర్భంగా GEN Z GIRLS’ టైటిల్ అనౌన్స్మెంట్

అల్లు అర్జున్ గురించి కాఫీ విత్ కరణ లో విషయాలు పంచుకున్న రష్మిక మందన్న

కిల్లర్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది - డైరెక్టర్ హరీశ్ శంకర్

తర్వాతి కథనం
Show comments