సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (11:16 IST)

శివునికి నేతి దీపం.. సోమవారం సాయంత్రం 04.30 గంటల నుంచి..? (video)

Ghee Lamp
సోమవారం పూట శివునికి నేతి దీపం వెలిగించడం ద్వారా ఐశ్వర్యాలు చేకూరుతాయి. నేతి దీపాన్ని ఆవునేతితో వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రీలక్ష్మికి, ఇలవేల్పుల పూజకు కూడా నేతి దీపం శ్రేష్ఠం. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే.. నేతి దీపంలో సోమవారం శివునికి దీపం వెలిగించడం చేయాలి. ఇలా చేస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. సమస్త దోషాలుండవు. గ్రహ దోషాలుండవు. 
 
అలాగే సోమవారం పూట ఈశ్వరునికి దీపం వెలిగిస్తే.. లేదంటే.. చక్రతాళ్వార్ సన్నిధిలో నేతి దీపం వెలిగించి రోజూ 12 సార్లు ప్రదక్షణలు చేయాలి. ఇలా 48 రోజులు చేస్తే.. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే సోమవారం పూట లేదంటే శుక్రవారం పూట ఇరు నాగదేవతలున్న ఆలయాల్లో అభిషేకం చేయించి.. పసుపు కుంకుమలు సమర్పించి.. దంపతులు అర్చన చేస్తే.. దాంపత్యం అన్యోన్యంగా మారుతుంది. 
 
పితృ దోషాలున్నవారు వరుసగా అమావాస్య రోజుల్లో నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహా విష్ణువును పూజించడం చేయాలి. అలాగే సోమవారం పూట సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 4.30గంటల నుంచి 6.00 గంటల్లోపు నేతి దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితుడు చెప్తున్నారు.