గోంగూర తోట కాడ కాపుకాశాకు స్టెప్పులు.. నాలుగో వారం ఆ ఏడుగురు..?
సోమవారం వస్తే ఎలిమినేషన్‌కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరగడం కామన్. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఏడుగురు సభ్యులు ఉండగా, వారిలో ఎవరు ఇంటిని వీడనున్నారనేది ఆసక్తిగా మారింది. సోమవారం ఎసిపోడ్ గోంగూర తోట కాడ కాపుకాశా అనే పాటతో మొదలైంది. ఆ తర్వాత మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతీ దీక్షిత్ మిగతా ఇంటి సభ్యులకు నవరసరాలు నేర్పించింది.
శృంగార రసం అభిజిత్‌తో చేయగా, విషాదం నోయల్‌తో చేసింది. తండ్రి పాత్రని నోయల్ పోషించగా, ఆయన చనిపోయిన క్రమంలో స్వాతి వెక్కి వెక్కి ఏడ్చింది. అది చూసి మోనాల్ కూడా కంట కన్నీరు పెట్టుకుంది. భీబత్సం రసం పండించేందుకు నోయల్- లాస్య రంగంలోకి దిగారు. వీరిద్దరు పర్‌ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయ్యారు. గట్టిగా గట్టిగా అరుస్తూ తమ తమ పాత్రలలో తెగ జీవించేశారు.
ఇక ఆ తర్వాత దివి నామినేషన్ విషయంలో మెహబూబ్ తో పాటు అభిజిత్‌తో చర్చించింది. అనంతరం అవినాష్.. అరియానాతో రొమాంటిక్ చర్చలు జరపగా, ఆ తర్వాత మోనాల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొంత సేపు హాస్యం పండించి అందరిని నవ్వించాడు.
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 23 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. సోమవారం నాలుగో నామినేషన్ వారం కావడంతో ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ కావడంతో ఎపిసోడ్ ముగిసింది.
ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా సొహైల్-అఖిల్ ఇద్దరూ హిట్ మెన్‌లుగా ఉంటారని.. ఈ ఇద్దరికీ ఒక డెన్ ఉంటుందని.. వాళ్లకు తలో ఐదు వేలు ఇచ్చారు బిగ్ బాస్. అలాగే ఇంటి సభ్యులందరికీ తలో పది వేలు ఇచ్చారు. ఐదుసార్లు బజర్ మోగుతుంది మోగిన ప్రతిసారి హిట్ మెన్‌లు ఉండే డెన్‌కి వెళ్లి.. ఎవర్ని షూట్ చేయాలో చెప్పి డీల్ కుదుర్చుకోవాలని చెప్పారు. పోటీ పడి డెన్‌కి వెళ్లాలని అలా వెళ్లిన వాళ్లు సేవ్ కావడంతో పాటు ఒకర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్. తర్వాత కెప్టెన్‌గా ఉన్న గంగవ్వతో పాటు అరియానాలు ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టు చెప్పారు బిగ్ బాస్.
మొదటిగా రాజశేఖర్ మాస్టర్ వెళ్లి స్వాతి దీక్షిత్‌ని షూట్ చేయాలని డీల్ కుదుర్చుకోవడంతో ఆ డీల్‌ని అఖిల్ కంప్లీట్ చేశాడు. దీంతో స్వాతి డెడ్ అయ్యింది. అఖిల్‌కి 10 వేలు వచ్చాయి. తర్వాత మెహబూబ్ వెళ్లి అభిజిత్‌ని షూట్ చేయాలని హిట్ మెన్‌లతో డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో అఖిల్ వెళ్లి అభిని షూట్ చేశాడు. దీంతో అభి ఈవారం నామినేషన్‌లోకి వచ్చాడు.
తర్వాత అరియానా గ్లోరి లాస్య పేరు చెప్పగా ప్రతివారం మాదిరే మెహబూబ్‌ని నామినేట్ చేసింది హారిక. దీంతో మొహబూబ్ నామినేట్ అయ్యాడు. చివరిగా బజర్ మోగే టైంకి సుజాత రావడంతో కుమార్ సాయిని షూట్ చేయడానికి డీల్ కుదుర్చుకుంది. మొత్తంగా హిట్ మెన్లుగా ఉన్న అఖిల్, సొహైల్‌లలో నాలుగు సార్లు గన్‌ని చేజిక్కించుకుని 40 వేలను సంపాదించాడు అఖిల్.
సొహైల్ ఒకే ఒక్కసారి గన్‌ని సంపాదించడంతో పది వేలు మాత్రమే సంపాదించాడు. ఈ ఇద్దర్లో ఎవరిదగ్గర తక్కువ డబ్బు ఉంటే వాళ్లు నామినేట్ అయ్యే అవకాశం ఉండటంతో అఖిల్ బయటికి వెళ్లినప్పుడు అతడి డబ్బును దొంగతనం చేసిన అఖిల్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోగా సొహైల్ నామినేట్ అయ్యాడు.
అఖిల్ సేవ్ కావడంతో ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉండటంతో హారికను నామినేట్ చేశాడు. నాలుగోవారం ఎలిమినేషన్స్‌కి హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్ నామినేట్ అయ్యారు.