శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శనివారం, 17 నవంబరు 2018 (17:05 IST)

ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుందా...

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఈ నెల 11న అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సంచ‌ల‌న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఈ నెల 19 నుంచి ప్రారంభించ‌నున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాలో న‌టించే హీరోయిన్స్ ఎవ‌రు అనేది క‌న్ఫ‌ర్మ్ కాలేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్‌ను ఈ సినిమా ద్వారా సౌత్‌లో ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నాడ‌ట జ‌క్క‌న్న‌. ఇటీవ‌ల ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు రాజ‌మౌళి బోనీ క‌పూర్‌ని సంప్ర‌దించార‌ని స‌మాచారం. గ‌తంలో బాహుబ‌లి సినిమా విష‌యంలో శివ‌గామి పాత్ర‌కు శ్రీదేవిని సంప్ర‌దిస్తే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ చెప్పార‌ని అందుచేత ఆమెను అనుకున్న‌ప్ప‌టికీ కుద‌ర‌క ర‌మ్య‌కృష్ణతో ఆ పాత్ర చేయించామ‌ని చెప్పారు. ఇప్పుడు  శ్రీదేవి త‌న‌య కోసం ట్రై చేస్తున్నార‌ట‌. మ‌రి... బోనీ క‌పూర్ ఏమంటారో చూడాలి.