Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇలియానాను అంతసేపు చూడగలమా? అదే కేసీఆర్ నైతేనా? వర్మ వ్యాఖ్యలు

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 1 నవంబరు 2019 (19:09 IST)
రాంగోపాల్ వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కి వచ్చేశాక ఏదో రకంగా వార్తల్లో వుంటూనే వున్నారు. ఆమధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ బయోపిక్ తీసి హాట్ టాపిక్ అయ్యాడు. చిత్రం విడుదలైన సమయంలో ఏదో హడావుడి చేశారు కానీ ఆ తర్వాత పరిస్థితి మామూలైపోయింది. 
 
ప్రస్తుతం మరోసారి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ కాంట్రవర్శీ చిత్రంతో ముందుకు వస్తున్నారు. పైగా ఈ చిత్రంలో ఏకంగా తెదేపా, వైకాపా నాయకుల పేర్లను పెట్టేసి చిత్రాన్ని తెరకెక్కించడంతో ఆయా పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పుడు వర్మ ప్రమోషన్ అంటూ ఆ ఛానల్, ఈ ఛానల్ అంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అందం గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అంత అందగాడు మరెవరూ లేరంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఎన్ని గంటలు మాట్లాడుతున్నా ఆయన్ని అలా గుడ్లప్పగించి చూస్తానని చెప్పారు. 
 
చెప్పాలంటే ఆయన అందం ముంది ఇలియానా అందం సైతం దిగదుడుపేనంటూ చెప్పిన వర్మ, కేసీఆర్ ను చూసినంత సేపు ఇలియానాను చూడగలమా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఈ కోణంలో జనం కూడా చూస్తే కానీ ఇందులో నిజం ఎంత వుందో అర్థమవుతుంది మరి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments