Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదీ ప్రవాహంలో ఉన్నట్టుండి పైకి ఉబికిన భూమి... ఎక్కడ? (Video Viral)

Written By ఠాగూర్
Updated: శనివారం, 24 జులై 2021 (19:56 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. అయితే, ఈ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి పారుతున్నాయి. ఈ క్రమంలో ఓ నదీ ప్రవాహానికి భూమి ఒక్కసారిగా ఉన్నట్టుండి పైకి ఉబికివచ్చింది. ఈ వింతను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. అయితే హర్యానాలోని ఒక నదీ ప్రవాహంలో నీటి నుంచి ఉన్నట్టుండి భూమి పైకి లేచింది. నీటిపై కొన్ని అడుగుల ఎత్తుకు భూమి లేవడాన్ని గమనించిన స్థానికులు తమ మొబైల్స్‌లో వీడియో తీశారు. ఇలా నీటి నుంచి భూమి పైకి లేవడాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు.
 
మరోవైపు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. నీటిపై భూమి పైకి లేవడానికి కారణం ఏమిటన్నదానిపై కొందరు పలు అభిప్రాయాలు తెలిపారు. 
 
టెక్టోనిక్ ప్లేట్ కదలికల వల్ల భూమి పెరిగి ఉండవచ్చునని భూగోళ శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టెక్టోనిక్ ప్లేట్‌ కదలిక వల్ల కాదని, భూమి లోపలున్న మీథేన్ గ్యాస్‌ విడుదల వల్ల నీటిలోని తడి పొర బుడగలాగా పైకి లేచిందని మరి కొందరు అభిప్రాయపడుతన్నారు.
 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments