Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వీడియో చూస్తే పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు పెట్టరు? (వీడియో)

Written By సెల్వి
Updated: బుధవారం, 2 అక్టోబరు 2024 (19:38 IST)
children addiction
మీ పిల్లలు సెల్ ఫోన్లను పదే పదే చూస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. ఈ వీడియో చూస్తే కనుక పిల్లలకు సెల్‌ఫోన్లు ఏమాత్రం చేతికివ్వడం చేయరు. పిల్లలకు సెల్ ఫోన్లను ఇవ్వడం ఎంత తప్పో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో స్కూలుకు సిద్ధం అవుతున్న ఓ బాలుడు సెల్ ఫోన్ చూస్తూ కూర్చుని వుండగా.. ఆ బాలుడి తల్లి ఆతనిని మందలించింది. స్కూలుకు వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు చూడటం ఎందుకని.. ఆ బాలుడి చేతి నుంచి స్మార్ట్ ఫోన్ లాక్కుంది. బుక్ తీసి హోం వర్క్ పూర్తి చేయమని మందలించింది. ఇక ఆ బాలుడు కూడా బుక్ చేతికి తీసుకుని చదవడం మొదలెట్టాడు. 
 
కానీ స్మార్ట్ ఫోన్ లాక్కుందనే కోపంతో బుక్‌పై కోపం చూపాడు. చదువుపై ఆ బాలుడి మైండ్ పోలేదు. అంతే పుస్తకాన్ని పక్కనబెట్టి బయటికి వెళ్లాడు. తర్వాత లోపలికి వచ్చి గోడకి ఆనించి వున్న బ్యాటుతో తల్లి తలపై లాగి కొట్టాడు. 
 
అంతే ఆ మహిళ కుప్పకూలిపోయింది. అమ్మ కిందపడిపోయిందనే ధ్యాస లేకుండా ఆమె చేతిలో వున్న స్మార్ట్ ఫోనును తీసుకుని మళ్లీ ఫోన్ చూడటం మొదలెట్టాడు ఆ బాలుడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments