Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి.. కళ్లను మూసుకోండి... అపుడే మోక్షం

ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి తాత్రిక కోణం వెలుగు చూసింది. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటిలో అణువణువూ గాలించారు. అపుడు ఆ ఇంటిలో కొన్ని కాగితాలను స

Written By pnr
Updated: సోమవారం, 2 జులై 2018 (10:06 IST)
ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి తాత్రిక కోణం వెలుగు చూసింది. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటిలో అణువణువూ గాలించారు. అపుడు ఆ ఇంటిలో కొన్ని కాగితాలను స్వాధీనం చేసుకున్నారు.
 
'(చావడానికి) మీరు బల్లను ఉపయోగిస్తే మీ చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి. కళ్లను మూసుకోండి. అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది' అని ఆ కాగితంలో ఉన్నట్టు సమాచారం. ఒక్క ప్రతిభా దేవి మృతదేహం మినహా మిగతావారందరి మృతదేహాలూ అదే స్థితిలో కనిపించడంతో దీని వెనుక తాంత్రిక కోణం ఉన్నట్టు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. 
 
పైగా, చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు నగలన్నీ యధాతథంగా ఉండటం.. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులూ ఎక్కడివక్కడ ఉండటం.. ఇంటిపైన ఉన్న కుక్క గట్టిగా మొరిగిన దాఖలాలు లేకపోవడం.. ఇంటి తలుపులను బలవంతంగా విరగ్గొట్టి ఎవరూ చొరబడినట్టు లేకపోవడంతో పోలీసులు తాంత్రిక కోణంపైనే ఎక్కువగా దృష్టిసారించారు. 
 
ఈ కేసులో పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇంటి సభ్యుల్లోనే తాంత్రిక పూజలు చేస్తున్న ముగ్గురు... ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఇంటిల్లిపాదినీ చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. శనివారం రాత్రి ఆహారంలో మత్తు మందు కలిపి.. అందరూ మత్తులోకి జారుకున్నాక వారిని చంపేసి ఉంటారని, మధ్యలో నారాయణ దేవికి మెలకువ రావడంతో ఆమె గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు విశ్లేషిస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments