సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:11 IST)

మెగాస్టార్ చిరంజీవి 42వ పెళ్లిరోజు, శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్

ఈ ఫిబ్రవరి 20వ తేదీన మెగాస్టార్ చిరంజీవి 42వ పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన మా మెగాస్టార్ అన్నయ్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక మరో రెండు చిత్రాలు పట్టాలెక్కనున్నాయి.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అడవుల్లో ఆచార్య చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అందువల్లో చెర్రీ అక్కడ నుంచి తన తల్లిదండ్రులకు వెడ్డింగ్ డే విషెస్ చెప్పాడు.
తన తల్లిదండ్రులు కలిసి కూర్చున్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. “నా పెద్ద బలం!! మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.” అని పోస్ట్ చేసాడు చెర్రీ.