శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (11:13 IST)

వైఎస్ అభిమానులు, నేతలతో షర్మిల భేటీ..

తెలంగాణలో మరో కొత్త పార్టీకి బీజాలు పడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. '
 
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులు, నేతలతో చర్చించారు. కాగా, ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో ఆమె భేటీ కాబోతున్నారు. మార్చి నెల కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 
 
క్షేత్రస్తాయిలో కొత్త పార్టీ గురించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా అడుగులు వేయాలి, రాజన్నరాజ్యం ఏర్పాటు చేయడానికి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి తదితర విషయాలపై ఆమె ఈ భేటీల్లో చర్చించబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో ఆమె వరసగా భేటీ అవుతుండటం విశేషం.