గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 20 జనవరి 2023 (19:47 IST)

Harley Davidson బైకుపై పాల వ్యాపారం.. వీడియో వైరల్

Harley Davidson
Harley Davidson
Harley Davidson బైక్ చాలా కాస్ట్లీ. ఆ బైకుపై ఓ పాల వ్యాపారి హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్‌పై పాలు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
పాల వ్యాపారి అమిత్ భదానా పాల వ్యాపారి కాదు. ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ఆయన తన అభిరుచిని కొనసాగించేందుకు ఉద్యోగాన్ని వదిలేసి పాల వ్యాపారంలోకి వచ్చారు. 
 
అలాగే ఆయనకు బైకుల రైడింగ్ అంటే చాలా ఇష్టం. రూ.5లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ కారును కొనుగోలు చేయాలని భదానా నిర్ణయించుకున్నాడు. 
 
తన పాల డెలివరీ కోసం మోటార్ సైకిల్‌ను ఉపయోగించడం ప్రారంభించాడు. ఈ వీడియోలో భదానా తన ఇంటి నుంచి హార్లే డేవిడ్ సన్ కారులో బయలుదేరుతుండగా, బైక్ కు ఇరువైపులా రెండు పాల డబ్బాలు వేలాడుతూ కనిపించాయి. 
 
పాలు డెలివరీ చేసే సమయంలో ఇంత ఖరీదైన మోటార్ సైకిల్‌పై వెళ్లడం చూసి అందరూ షాకయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.