Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎస్ఎస్ సమావేశానికి కాంగ్రెస్ కురువృద్ధుడు?

మేషం: బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్

Written By pnr
Updated: మంగళవారం, 29 మే 2018 (09:56 IST)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమావేశానికి కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. వచ్చే నెల 7వ తేదీన నాగ్‌పూర్ వేదికగా జరుగనున్న సంఘ్‌ శిక్షావర్గ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.
 
దీనిపై ఆప్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్‌ ప్రముఖ్‌ అరుణ్‌ కుమార్‌ స్పందిస్తూ, తమ కార్యక్రమానికి వచ్చేందుకు ప్రణబ్‌ అంగీకరించడం ఆయన గొప్పతనాన్ని సూచిస్తుందన్నారు. నాగపూర్‌లోని రేష్మీబాగ్‌లో ఉన్న కేంద్ర కార్యాలయంలో జరిగే వార్షిక కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అన్నారు. 
 
రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నంత మాత్రాన శత్రువులు కారని ప్రణబ్‌ తన అంగీకారం ద్వారా దేశానికి సంకేతాలు పంపారని సంఘ్‌ నేత రాకేశ్‌ సిన్హా అన్నారు. కాగా, ప్రణబ్‌కు మొదటి నుంచీ సంఘ్ పరివార్‌తో సత్సంబంధాలున్నాయని, 2012లో రాష్ట్రపతి కాగానే ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ను రాష్ట్రపతి భవన్‌కు మధ్యాహ్న విందుకు ఆహ్వానించారని సంఘ్‌ వర్గాలు గుర్తుచేశాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments