ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (10:27 IST)

భాగస్వాములంతా ఒప్పుకుంటేనే ప్రధాని గద్దెనెక్కుతా : రాహుల్

యూపీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన నేతలంతా అంగీకరిస్తే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.

యూపీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన నేతలంతా అంగీకరిస్తే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కూటమి పార్టీలన్నీ ఒప్పుకుంటే… ప్రధాని అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
 
అయితే, తాను ప్రధానికావడం కంటే ముందుగా అన్ని పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని ఎవరు అవుతారన్నది రెండు దశల నిర్ణయమని… ప్రధాని అంశమనేది రెండో ఆప్షన్ అన్నారు. కూటమి పార్టీలతో ఈ అంశాన్ని చర్చించామని, ముందుగా బీజేపీని ఓడించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని అంశంపై ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. 
 
మీరు ప్రధాని అయ్య అవకాశాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒకవేళ మిత్రపక్షాలు ఆశిస్తే, తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. ఆలయాలకు, మసీదులకు, గురుద్వారాలకు ఎన్నో ఏళ్ల నుంచి వెళ్తున్నాని… కానీ ఇప్పుడు దాన్ని ప్రతిపక్షాలు ఓ సమస్యగా చూస్తున్నాయన్నారు. తాను ఆలయానికి వెళ్లడం బీజేపీకి నచ్చడం లేదని… నేను గుడికి వెళ్తే వాళ్లకు కోపం వస్తోందని, గుడులు కేవలం బీజేపీ నేతలకే సొంతమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.