సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By కుమార్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:21 IST)

చర్చల ద్వారా పరిష్కారమా? ఐతే మూడు పెళ్ళిళ్లు ఎందుకు చేసుకున్నారు..?

సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన పుల్వామా దాడికి వ్యూహ రచన పాకిస్థాన్‌లోనే జరిగిందని ప్రపంచమంతా కోడై కూస్తుంటే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తమ మీద చేసేవన్నీ నిరాధారమైన ఆరోపణలే అని చెబుతున్నారు. ఆ దాడికి తమను నిందించడం సరికాదంటున్నారు.


చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని ప్రకటించారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తనదైన రీతిలో స్పందించారు. 
 
డియర్ ప్రైమ్ మినిస్టర్ చర్చలతోనే సమస్యలు పరిష్కారం అయ్యేటట్లయితే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరో ట్వీట్‌లో "ఒక వ్యక్తి ఆర్డీఎక్స్ పట్టుకుని మావైపు పరుగెత్తుతూ వస్తుంటే అతనితో చర్చలు ఎలా జరపాలో అమాయకులైన మా భారతీయులకు చెప్పండి సార్. 
 
నేర్పించినందుకు మేము ట్యూషన్ ఫీజ్ కూడా ఇస్తాము.... మీ దేశంలో ఎవరు ఉన్నారో (ఒసామా బిన్ లాడెన్) అమెరికాకు తెలిసి, ఆ విషయం మీ దేశానికి తెలియనప్పుడు అదీ ఓ దేశమేనా" అంటూ చురకలు అంటించారు.