అంబేద్కర్ పేరును మార్చేశారు... ఇక రామ్‌జీ అంబేద్కర్...

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఇది మనం ఇప్పటివరకు చదువుకున్న పేరు. వింటున్న పేరు. చరిత్ర పుటల్లో ఉన్న పేరు కూడా ఇదే. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకు

శుక్రవారం, 30 మార్చి 2018 (09:09 IST)
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఇది మనం ఇప్పటివరకు చదువుకున్న పేరు. వింటున్న పేరు. చరిత్ర పుటల్లో ఉన్న పేరు కూడా ఇదే. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులు ఆ పేరును మార్చేశారు. అంబేద్కర్ పేరుకు ముందు రామ్‌జీ అనే పదాన్ని తగిలించారు. అంటే ఇకపై డాక్టర్ బీఆర్. రామ్‌జీ అంబేద్కర్ అని పేరు పెట్టారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ జితేంద్రకుమార్‌ పేరుతో విడుదలైన జీవోలో పేర్కొన్నారు.
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ పేరు మార్పుపై వివరణ ఇస్తున్నారు. 'రామ్‌జీ' అనేది అంబేడ్కర్‌ తండ్రి పేరని, మహారాష్ట్రలో పుట్టి పెరిగినవారికి తమ పూర్తిపేరు మధ్యలో తండ్రి పేరును కలుపుకోవడం ఆనవాయితీ అని, అందుకే తాము ఇలా పొందుపరిచామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 
 
అయితే, దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అంబేడ్కర్‌ పేరును రాజకీయం చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పిల్లవాడికి కూడా అంబేడ్కర్‌ అంటే తెలుసని, అలాంటిది ఇప్పుడు పేరులో రామ్‌జీ అని చేర్చాల్సిన పని ఏమిటని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసమే యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగిందని సమాజ్‌వాదీ పార్టీ నేత అనురాగ్‌ భదోరియా విమర్శించారు. 

అన్నీ చూడండి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments