Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాంత్రిక పూజలు చేశాను.. నిజమే.. క్షమించండి.. రాధాకృష్ణ

Updated: ఆదివారం, 30 డిశెంబరు 2018 (17:11 IST)
సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పగటిపూట చేయాల్సిన పూజలను అర్థరాత్రి చేయడంపై గతంలో వివాదం చెలరేగింది. దీంతో ఆలయ వేద పండితుడు రాధాకృష్ణ శర్మను విధుల నుంచి బోర్డు తప్పించింది. ఈ నేపథ్యంలో ఆలయ వేద పండితుడు రాధాకృష్ణ శర్మ కాస్త వెనక్కి తగ్గారు. తాను తాంత్రిక పూజలు చేశానని.. దయచేసి క్షమించండంటూ.. శ్రీశైలం ఆలయ ఈవోకు లేఖ రాశారు. 
 
తన ఇంట్లో రాత్రిపూట పూజలు చేసిన మాట నిజమేనని రాధాకృష్ణ చెప్పారు. హైదరాబాదుకు చెందిన సురేశ్ చంద్రతో కలిసి తాను పూజలు చేశానని అంగీకరించారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ నిజమని రాధాకృష్ణ శర్మ అంగీకరించారు.
 
భవిష్యత్‌లో ఇలాంటి పనులు చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఏపీ మానవహక్కుల కమిషన్, హైకోర్టుల్లో దాఖలుచేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments