ప్రజా కూటమిపై #PSPK ఫ్యాన్స్ సెటైర్స్... మొదలైన మీమ్స్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి అభ్యర్థులు బాగా వెనుకబడిపోతున్నారు. మరోవైపు తెరాస కారు 76 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. దీనితో తెరాస సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు ఏపీలో #PSPK ఫ్యాన్స్... అదేనండి జనసేన పార్టీ అభిమానులు ప్రజా కూటమిపై సెటైర్లు పేల్చుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో జోష్ చేస్తున్నారు.
ఇకపోతో సహజంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చాలా పార్టీలు ఎన్నికల్లో బోల్తా కొట్టాయి. ఆఖరికి చంద్రబాబు నాయుడు హయాంలోని తెదేపా కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఇకపోతే తాజా తెలంగాణ ఎన్నికల్లో తెరాస కారు జోరు చాలా స్పీడుగా వుంది. మొత్తం 119 స్థానాల్లో 84 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
గతంలో 2014లో కేవలం 64 సీట్లు గెలుచుకున్న తెరాస ఇప్పుడు ఏకంగా 84 స్థానాలకు పైగా చేజిక్కించుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపధ్యంలో ప్రజా కూటమికి చావుదెబ్బ తగిలింది. ఇదంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు జత కట్టడంతోనే మారిందా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. చూడాలి ఫైనల్ ఫలితాలు ఎలా వుంటాయో?