Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పిల్లి పిల్లను రూ. 5.1 లక్షలకు బుక్ చేస్తే పులి పిల్లను పంపారు

Written By వి
Updated: సోమవారం, 12 అక్టోబరు 2020 (17:12 IST)
సాధారణంగా ఆన్లైన్ ద్వారా మనకు కావలసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తుంటాము. అందులో ఏదైనా పొరపాటు జరిగితే ఆ వస్తువును తిరిగి రిటర్న్ ఇవ్వవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఓ జంట సరదాగా చేసిన ఆన్లైన్ షాపింగ్ షాక్‌కు గురిచేసింది.
 
వివరాలలిలా వున్నాయి. ప్రాన్స్ లోని నార్మండీ ప్రాంతం లీ హవ్రెకు చెందిన ఓ జంట 2018లో ఓ యాడ్‌ను చూసారు. అందులో సహానా జాతికి చెందిన పిల్లి పిల్లలను అమ్ముతామన్న ప్రకట ఉన్నది. దీంతో వారు 7 వేల డాలర్లు (5.1 లక్షలు) ఇచ్చి ఆర్డర్ చేసారు. ఆన్లైన్ ద్వారా ఆ పిల్లలను డెలివరీ చేసారు.
 
రెండు సంవత్సరాల పాటు వాటిని సరదాగా పెంచుకుంటూ వచ్చారు. చివరకు వాటి స్వభావం పిల్లి పిల్లకు ఉండే లక్షణాలు లేకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిపుణులకు ఇచ్చి పరీక్షించగా అది అరుదైన సమత్రా జాతికి చెందిన పులి పిల్లగా తేల్చారు. కానీ ఆ విషయం దంపతులకు తెలియలేదు.
 
అంతరించి పోతున్న అరుదైన సమత్రా జాతి పులి కావడంతో,ఇది ప్రపంచవ్యాప్తంగా 400 మాత్రమే ఉన్నాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వెల్లడించింది. ఇలాంటి అరుదైన పులిని తమ దగ్గర ఉంచుకోవడం నేరమని ఆదంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పులి ఆరోగ్యంగా ఉందని పోలీసులు దానిని ప్రెంచ్ బయోడైవర్సిటీ ఆఫీస్‌కు అప్పగించారు. అయితే ఆ దంపతులు సరదాగా ఆ పులి పిల్లతో సెల్పీలు, వీడియోలు తీసుకున్నారు. తెలయకుండా చేసిన సరదా చివరకు వారిని జైలు పాలు చేసింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments