Biodata Maker
✕

భారత్‌లో మూడో కరోనా కేసు.. చైనాలో ఒక్క రోజే 57 మంది మృత్యువాత

Written By ఠాగూర్
Updated: సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (13:25 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా భారత్‌లో మూడో కేసు నమోదైంది. కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్ నగరం నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ రోగిని ఐసోలేటెడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే, చైనాలో పర్యటించవద్దని దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా, చైనా నుంచే భారత్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ వైరస్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఫలితంగా చైనీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 57 మంది చనిపోవడం షాకిచ్చింది. ఇది చాలదన్నట్లు ఒకేరోజు కొత్తగా 2,829 మంది వ్యాధి బారినపడినట్టు తేలడం వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో కరోనా వైరస్ కారణంగా చైనాలో మరణ మృదంగం ఎక్కడికి చేరుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కాగా, బాధితుల సంఖ్య ఇప్పటివరకు 17,205కి చేరింది. మరో 1,89,583 మంది అనుమానితులు ఉన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చైనా నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తోంది.  

అన్నీ చూడండి

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

Naga Chaitanya: వృషకర్మ నుంచి స్వాగ్ అటిట్యూడ్‌తో ‘స్వాగ్ ఆఫ్ అర్జున్ రిలీజ్

Nithin look: అలియాస్ రుక్మిణి చిత్రం కోసం యవ్వనంతో కూడిన కృష్ణ పాత్రలో నితిన్

Sandiyar Kamal Haasan's birthday: కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా సండియర్ షూటింగ్ ప్రారంభం

జయంత్ అండ్ ది జింగో పెన్ ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

తర్వాతి కథనం
Show comments