బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (09:01 IST)

ఆ ఒక్కటీ అడక్కండీ.. మీటింగ్ బాగుంది.. డోనాల్డ్ ట్రంప్

నిన్నామొన్నటివరకు కయ్యానికి కాలుదువ్వుకున్న అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు చేతులు కలిపారు. వారిద్దరూ సింగపూర్ వేదికగా చారిత్రాత్మక భేటీని నిర్వహించారు. ఈ భేటీకి సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వేదికైంది

నిన్నామొన్నటివరకు కయ్యానికి కాలుదువ్వుకున్న అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు చేతులు కలిపారు. వారిద్దరూ సింగపూర్ వేదికగా చారిత్రాత్మక భేటీని నిర్వహించారు. ఈ భేటీకి సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వేదికైంది. ఈ భేటీ కోసం ఇరు దేశాధినేతలైన డోనాల్డ్ ట్రంప్ (అమెరికా), కిమ్ జాంగ్ ఉన్ (ఉత్తరకొరియా)లు ప్రత్యేకంగా తరలివచ్చారు.
 
ఆ తర్వాత వీరిద్దరి మధ్య సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలవనుంది. అమెరికాకు అధ్యక్షుడు ఉత్తర కొరియా నేతను కలుసుకోవటం ఇది తొలిసారి. అలాగే, ఉత్తరకొరియా అధినేతగా అధికారం చేపట్టాక తొలిసారిగా కిమ్‌జోంగ్ సుదీర్ఘకాలం విదేశీ చేపట్టిన విదేశీ పర్యటన ఇదే. 
 
భారతీయకాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఇరు దేశాధినేతలూ తాము బసచేసిన ప్రాంతంనుంచి కేపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. తర్వాత ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. తరువాత రిసార్ట్స్‌లో ప్రత్యేకంగా కేటాయించిన గదిలో చర్చలు జరిపారు. 
 
ఈ భేటీ అనంతరం డోనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని చెప్పారు. ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ పెద్ద సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో తామిరువురమూ కలిశామని, కిమ్‌తో ఏకాంతంగా జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయనే నమ్ముతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం తర్వాత ట్రంప్, కిమ్‌ల ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.