వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)
మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఇంటి వాకిట్లోకి వచ్చిన శునకాన్ని లేదా పశువులను కేకలు వేస్తూ కొంతమంది అదిలిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మృగరాజు సింహాన్ని వెంటబడి తరుముతూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు ఔరా... అతడిది మామూలు గుండెకాయ కాదు సుమా అని కామెంట్లు పెడుతున్నారు.
పూర్తి వివరాలు చూస్తే... గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ రైల్వే ట్రాక్‌ను ఓ సింహం దాటుతూ కనిపించింది. అది తమ కుటుంబ సభ్యులు వుంటున్నవైపు వస్తుందేమోనని రైల్వే గార్డ్ ఓ కర్రను తీసుకుని సింహాన్ని అదిలిస్తూ ముందుకు వెళ్లాడు. ఆశ్చర్యకరంగా అతడు ఆ సింహాన్ని చూసి ఎంతమాత్రం భయపడకుండా దాని వెనకాలే వెళుతూ ఏదో కుక్కనో, గేదెనో తరుముతున్నట్లు వెంటబడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.