రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది
ఆపదలో వున్నవారిని రక్షించే బాధ్యత కలిగిన వృత్తిలో వున్న అధికారి ఆయన. మరికొన్ని నెలల్లో రిటైర్ అవుతాడు. ఐతే ఆయనలోని కామాంధుడనే రాక్షసుడు బైటపడటంతో ఓ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెను బాత్రూంకి తీసుకుని వెళ్లి 35 సెకన్ల పాటు మహిళపై అతడు అకృత్యాన్ని సాగించాడు. ఆ దృశ్యాన్ని బాత్రూం కిటికీ నుంచి ఎవరో వీడియా తీసారు.
దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది తెలుసుకున్న సదరు అధికారి పరారయ్యాడు. చివరికి అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహిళను వేధించిన ఈ అధికారి డిప్యూటీ ఎస్బీ బి రామచంద్రప్పగా గుర్తించారు. ఇతడు చేసిన పనికి సెక్షన్ 68, 75, 79 కింద కేసు నమోదు చేసి జైలుకి పంపారు. ఘటనపై పూర్తి విచారణ చేయనున్నట్లు తుముకూర్ జిల్లా పోలీసు సూపరిండెంట్ తెలిపారు. కాగా తను భూ వివాదం పరిష్కరించమని రామచంద్రప్ప వద్దకు వెళ్లగా అతడి నుంచి అభ్యంతరకరమైన డిమాండ్లు వచ్చినట్లు ప్రాధమికంగా తేలింది.