శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:06 IST)

మూడో అంతస్తు నుంచి దూకేసిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ - ఇద్దరు ఎమ్మెల్యేలు

mla jump
మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ఆయన పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇదే పని చేశారు. అదృష్టవశాత్తు సేఫ్టీ నెట్స్‌లో పడటంతో వారికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఓ గిరిజన తెగగు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ సాహసం చేశారు. 
 
మహారాష్ట్రలోని ఉన్న తెగల్లో ఒకటైన ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయనతో పాటు మరో ఇద్దరు గిరిజన శాసనసభ్యులు కూడా కిందకు దూకేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడ నుంచి తరలించారు. అయితే, ఈ ఘటనలో మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఎస్టీల్లో ధంగార్ తెగను చేర్చే అంశం మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్‌ను నిరసిస్తూ పలువురు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవర్ వర్గానికి చెందిన నేత ఆందోళనకు దిగారు. ధంగార్ తెగకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎస్టీ రిజర్వేషన్ కల్పించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి పెసా (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ పొడిగింపు) చట్టం కింద సేవలు అందిస్తే సరిపోతుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ కల్పించాలని భావిస్తుంది.