శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (16:14 IST)

ఏపీ శాసనసభ ఉప సభాపతిగా రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక

raghurama krishnamraju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్ఆర్అర్ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సభాపతి సీహెచ్. అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకు ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.
 
అంతకుముందు ఎన్డీయే కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, మంత్రులు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, టీటీడీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
 
డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో గురువారం మధ్యాహ్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. కాగా, అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే.